🙏🏻🕉️ *పురాణము - అవగాహన (1522)* 🕉️🙏🏻
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు.
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణము - అవగాహన అనే కార్యక్రమం శ్రీ ప్రణవపీఠము నిర్వహిస్తున్నది.
*_నిన్నటి ప్రశ్నలకు సమాధానాలు:_*
3043. 63 నాయన్మార్లలో ముఖ్యులు అప్పర్, జ్ఞాన సంబంధర్, సుందరర్, మాణిక్యవాచగర్ మాత్రమే ఎందుకు అయ్యారు?
◆ నియమంతో శివుడికి సర్వ శరణాగతి తో పూజ చేయడమే గాక భక్తుల అందరినీ ఐక్యం చేశారు. ఆలయాలు శుభ్రం చేయడం, సామూహిక భజనలు, పురాణ శ్రవణం, ధార్మిక కార్యాలు చేయడం, శివ పూజలు, తీర్థ యాత్రలు అందరి చేత చేయించడం, తాము స్వయంగా చేయడం వల్ల శివునికి శివ భక్తులకు మరింత దగ్గర అయ్యారు. అందుకే మనం తరించి నిస్వార్థంగా ఇతరులు తరించే మార్గం చూపించడం వల్ల అంతటి గొప్ప స్థాయి పొందారు.
3044. ఉపనయనం అయిన వామన మూర్తికి మొదట భిక్ష ఎవరు పెట్టారు? భిక్షాపాత్రను ఎవరు ఇచ్చారు?
◆ జగన్మాత పార్వతి, కుబేరుడు
నిన్నటి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చినవారు - మొత్తం 2 మంది. 👏
ముందుగా నమాధానం ఇచ్చిన వారి 2 పేర్లు. 👏
◆ గణేష్, తిరుపతి
◆ పసలపూడి వీర వెంకట సాయిబాబా, కాకినాడ.
*_ఈ రోజు ప్రశ్నలు:_*
3045. వామనునికి త్రివిక్రముడు అని ఎందుకు పేరు వచ్చింది.?
3046. అంజనా దేవి తల్లితండ్రులు ఎవరు?