శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి ఎం గౌరవిరెడ్డి మరియు బృందం తమ నాట్య ప్రదర్శన గావించారు.
ఈ ప్రదర్శనలో తాండవమాడే శివుడు అన్న పాటకు, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అన్న అన్నమాచార్య కీర్తనకు, మహదేవ శివ శంభో అన్న గీతానికి, భాగ్యాద లక్ష్మి బారమ్మ అనే పురందరదాస కీర్తనకు కళాకారులు తమ నృత్య ప్రదర్శనతో సభను సమ్మోహితులను చేశారు.
కోల్కతాలోని లాలాబాగన్ నబన్ కూర్ వద్ద దుర్గామాతను పర్యావరణహితంగా రూపొందించారు. మండపంలో ఆహ్లదకరమైన వాతావరణంలో నెలకొల్పిన అమ్మవారి ప్రతిమలను వెదురు, మనీ ప్లాంట్, కూరగాయలు, పలు రకాల పండ్లతో అలంకరించారు. దుర్గామాత ప్రతిమ రూపకల్పనకు ఐదు నెలలు శ్రమించిన సిబ్బంది, ఇందుకోసం సుమారు 8వేల మొక్కలను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శుక్రవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
కాగా 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అక్టోబరు 5వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
భక్తుల కొరకు టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను చేస్తున్నదన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను భక్తుల కొరకు కల్పించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఈ సౌకర్యాలను వారందరూ వినియోగించుకోవాలని కోరారు.