ఆధ్యాత్మిక పుస్తకాల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
https://t.me/Bwcsm (తెలుగు పుస్తకాలు)
https://t.me/CSMBookworld (ఇంగ్లీష్ పుస్తకాలు)
ఆధ్యాత్మిక పుస్తకాల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
https://t.me/Bwcsm (తెలుగు పుస్తకాలు)
https://t.me/CSMBookworld (ఇంగ్లీష్ పుస్తకాలు)
04. నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ
గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!
ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.
03. అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా
ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.
02. వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక
ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా!
ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!